: పాకిస్థాన్లో దారుణం.. ప్రేమజంటకు సాయం చేశాడని జర్నలిస్టును కాల్చి చంపేశారు
ప్రేమజంటకు సాయం చేశాడన్న కారణంతో ఓ జర్నలిస్టును కాల్చి చంపేసిన ఘటన పాకిస్థాన్లోని ప్రంజాబ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఓ యువతి పెద్దలను కాదని తాను ప్రేమించిన వ్యక్తిని వివాహమాడింది. దీంతో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తోన్న అజ్మల్ జోయియా(30) అనే వ్యక్తి ఈ దంపతులకు అండగా నిలిచాడు. ఆవేశంతో ఉన్న నవ దంపతుల కుటుంబ సభ్యుల నుంచి వారిని కాపాడాలని చూశాడు. ఈ క్రమంలో అజ్మల్ జోయియాపై పగ పెంచుకున్న యువతి కుటుంబసభ్యులు.. అజ్మల్ బైకుపై ప్రయాణిస్తుండగా అతనిపై దాడి చేసి తుపాకీతో కాల్చి హతమార్చారు. ఘటనపై పాకిస్థాన్లో పలు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.