: కొడుకు చేసిన పనికి ముందస్తు బెయిల్ కోసం కోర్టునాశ్రయించిన బీహార్ మహిళా ఎమ్మెల్సీ


కేవలం వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో యువకుడిని కాల్చి చంపినందుకు బీహార్ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాకీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో, మనోరమా దేవి ఇంట భారీ ఎత్తున మద్యం నిల్వలు లభించడంతో, సీఎం నితీశ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రొహిబిషన్ చట్టం ప్రకారం, ఆమె అరెస్ట్ తథ్యం కావడంతో, రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మనోరమ, నేడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు మనోరమను వెంటనే అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మనోరమ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు, దీన్ని సోమవారం విచారిస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News