: ధర్నాలు చేసినంత మాత్రాన విశాఖకు రైల్వే జోన్ రాదు: బీజేపీ
విశాఖపట్నం నగరానికి రైల్వే జోన్ ప్రకటించాలంటే, అందుకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎవరో వచ్చి ధర్నాలు చేసినంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం రైల్వే జోన్ ను ప్రకటించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. అయితే, విభజన చట్టంలో జోన్ ప్రస్తావన ఉన్నందున తామంతా జోన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అందుకున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన, తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాలని అన్నారు.