: రుణం కావాలంటే 'రాసలీల' ఉండాల్సిందే... అడ్డంగా బుక్కయిన బ్యాంక్ మేనేజర్!
రుణం కావాల్సి వచ్చిన వారు ఎవరైనా సరే... ఆయన కోరిన కోరికలు తీరిస్తే చాలట. ఆయనే కడప జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు జీఎం వెంకటేశ్వర్లు. మందు, మగువను ఎరగా వేస్తే, ఎక్కడికైనా వచ్చి, ఆనందించి, ఆపై లోన్ ఇచ్చేస్తారట ఆయన. ఆయన బాగోతాన్ని బయట పెట్టాలని ఎవరు అనుకున్నారో ఏమో! ఓ హోటల్ గదిలో రహస్య కెమెరా పెట్టేశారు. ఓ గుర్తు తెలియని లాడ్జిలో వెంకటేశ్వర్లు ఉన్న రాసలీలల దృశ్యాలు ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతున్నాయి. అయితే, సదరు వీడియో తనది కాదని, రుణం ఇవ్వలేదన్న కోపంతో ఎవరో మార్ఫింగ్ తో సృష్టించారని వెంకటేశ్వర్లు చెబుతుండటం గమనార్హం. ఈ వీడియోలో మాత్రం ఆయన స్పష్టంగా కనిపిస్తున్నారట. మరి నిజమేంటో?