: అత్యంత అరుదు... ఒకే రోజు లోక్ సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన బిల్లు ఇదే!
బడ్జెట్ మలివిడత సమావేశాల్లో నిరసనల కారణంగా ఒక్కసారి కూడా లోక్ సభ వాయిదా పడకపోగా, పార్లమెంట్ లో మరో అత్యంత అరుదైన ఘటన నమోదైంది. లోక్ సభ, రాజ్యసభలు ఓ బిల్లును ఒకేరోజు ఆమోదించగా, అదే రోజు రాష్ట్రపతి సైతం బిల్లుపై సంతకం పెట్టేశారు. రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్శిటీ బిల్లు విషయంలో ఇది చోటుచేసుకుంది. బీహార్ లోని సమస్తిపూర్ లో ఉన్న వర్శిటీ అభివృద్ధి, విస్తరణలకు సంబంధించిన బిల్లు కావడంతో ఏ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ యూనివర్శిటీ బిల్లు బీహార్ ప్రజలకు పెద్ద బహుమతని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్శిటీ మోతిహారీకి వచ్చింది. రాష్ట్రానికి రెండు కేంద్ర వర్శిటీలు రావడం, అవి ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్లతో ఉండటం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.