: తండ్రి గురించి నోరు జారిన జగపతిబాబు!


స్వేచ్ఛగా మాట్లాడటం మంచిదే. కానీ అదే స్వేచ్ఛ ఒక్కోసారి వివాదాస్పదం అవుతుంది కూడా. హీరోగా తన సత్తా చాటుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ను ఊపేస్తున్న జగపతిబాబు విషయంలో ఇదే జరిగింది. అనుకోకుండా తన తండ్రి గురించి ఆయన చేసిన ఓ వ్యాఖ్య కాస్తా వివాదాన్ని సృష్టించింది. జగపతిబాబు ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, తన జీవితంలోని మరో కోణాన్ని వెల్లడిస్తూ, హీరోయిన్ల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ఒకప్పుడు టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న తన తండ్రి జీవితాన్ని చూసి తాను కూడా ఓ 'ప్లే బాయ్'గా జీవితాన్ని ఆనందించానని ఆయన అనడం కొంత కలకలం రేపింది. జగపతిబాబు ఓపెన్ మైండెడ్ గా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, దివంగత తండ్రి గురించి ఇటువంటి నోరు జారడాలు లేకుండా ఉంటే బాగుండేదేమోనని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News