: 'మహాత్మా' హంతకుడు నాథూరాం గాడ్సేను పట్టుకున్న వ్యక్తి భార్యను 5 లక్షలతో సత్కరించిన నవీన్ పట్నాయక్


1948లో ఢిల్లీలోని బిర్లామందిరం వద్ద మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపిన తరువాత పారిపోతుండగా, అక్కడే తోటమాలిగా పని చేస్తున్న రఘు నాయక్ వేటాడి పట్టుకున్నారు. ఈ సాహసానికి గాను అప్పటి రాష్ట్రపతి బాబురాజేంద్ర ప్రసాద్ నుంచి 500 రూపాయల నజరానా అందుకున్నాడు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని జగులైపాడా గ్రామానికి చెందిన రఘు నాయక్ 1983లో మరణించాడు. కొన్నాళ్లకు ఆయన కుమారుడు కూడా మృతి చెందాడు. ఆయన భార్య మండోదరి కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. రఘు నాయక్ కు గుర్తుగా జగులైపాడా గ్రామాస్థులు 2005లో ఓ స్తూపం నిర్మించారు. 67 సంవత్సరాల తరువాత ఒడిశా ప్రభుత్వం ఆయన ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్... రఘు నాయక్ భార్య మండోదరి నాయక్ ను 5 లక్షల రూపాయలు, ప్రశంసాపత్రంతో సత్కరించారు.

  • Loading...

More Telugu News