: సినీ నటుడు గిరిబాబుకు జగన్ పరామర్శ
సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు ఈరోజు సాయంత్రం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గిరిబాబు భార్య అనారోగ్యంతో నిన్న అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.