: ఐపీఎల్ లో నేటి సందడి
ఐపీఎల్-6 సీజన్ లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు లీగ్ మ్యాచ్ లు అన్నీ పూర్తి కావస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు రెండు జట్లు సమరానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో 4 గంటలకు జైపూర్ వేదికగా 'రాజస్థాన్ రాయల్స్-హైదరాబాద్ సన్ రైజర్స్' తలపడనున్నాయి. అనంతరం రాత్రి 8 గంటలకు ముంబయి వేదికగా 'ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' పోటీ పడతాయి.
కాగా, నిన్నరాత్రి 'కోల్ కతా నైట్ రైడర్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్' మధ్య జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా గెలుపు సాధించింది. మూడుసార్లు పరాజయం పొందిన అనంతరం పుంజుకున్న నైట్ రైడర్స్ జట్టు విజయాల బాట పట్టింది. 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి పంజాబ్ ను చిత్తుగా ఓడించింది.