: రాష్ట్రంలో 29వేల గ్రామాల్లో కరవు ఉంది: స్పష్టం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
తమ రాష్ట్రంలో 29వేల గ్రామాల్లో కరవు పరిస్థితి ఏర్పడిందని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిల్లో ఎక్కువ గ్రామాలు మరట్వాడా, విదర్భ ప్రాంతాలకి చెందినవేనని పేర్కొంది. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫడ్నవిస్ సర్కార్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కరవు పరిస్థితి వల్ల ఏర్పడిన నీటి ఎద్దడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, రైతులు ఎదుర్కుంటోన్న కష్టాలనుంచి వారిని గట్టెక్కించడానికి పలు పథకాలు అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర సర్కార్ తెలిపింది. ముఖ్యంగా మరట్వాడా, విదర్భ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. కరవు పరిస్థితులను ఎదుర్కోనే విధానంపై సీఎం ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి అందిన నిధుల సాయంపై త్వరలో ప్రకటన చేయాలని సీఎం నిర్ణయించారు.