: మిస్టర్ చాందీ! సమాధానం చెప్పండి...ఎవరు? ఎవరికి డబ్బులిచ్చారు?: నిలదీసిన సుష్మా స్వరాజ్
కేరళ రాజకీయాలు పరిధులు దాటుతున్నాయి. ఓటర్ల మనసులు చూరగొనేందుకు దుమ్మెత్తి పోసేందుకు, చేయని అంశాలను కూడా చేసినట్టు చెప్పిన ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి నిలదీయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. లిబియా నుంచి 29 మంది కేరళీయులను స్వదేశానికి రప్పించేందుకు డబ్బులు చెల్లించామని, ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాందీ మీరు ఎవరికి? ఎంత? డబ్బులు ఇచ్చారని ట్విట్టర్ మాధ్యమంగా నిలదీశారు. తానైతే ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులను రక్షించడమే తమ కర్తవ్యంగా భారత విదేశాంగశాఖ పని చేస్తుందని ఆమె తెలిపారు. భారతీయులకు ఉన్న ఇబ్బందులు తొలగించడం తమ బాధ్యతగా పని చేస్తున్నాము తప్ప, డబ్బుల కోసం కాదని ఆమె స్పష్టం చేశారు.