: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆవేదన ఫలితం.. మే13న సుప్రీంలో నలుగురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధం
ప్రధాని సమక్షంలో జరిగిన ఓ సభలో ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పది లక్షల జనాభాకి కేవలం 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని, మోయలేనంత భారం న్యాయవ్యవస్థపై ఉందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల సంఖ్య, న్యాయవాదుల సంఖ్య పెంచాలని ప్రసంగం చేస్తూ ఠాకూర్ కంటతడి కూడా పెట్టారు. ఆయన ప్రసంగం ఫలితమే ఏమో.. సుప్రీంకోర్టులో రేపు నలుగురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. దీని కోసం న్యాయ శాఖ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్, అలహాబాద్ హైకోర్టుకు నుంచి జస్టిస్ డివై చంద్రచూడ్, కేరళ హైకోర్టుకు నుంచి జస్టిస్ అశోక్ భూషణ్, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎల్.నాగేశ్వరరావులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు సమాచారం.