: కాపులను బీసీల జాబితాలో చేర్చేది చంద్రబాబే, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం: చినరాజప్ప
కాపుల రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకుంటామని తెలిపారు. కాపులను బీసీల జాబితాలో చేర్చేది చంద్రబాబే అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. జూన్1 నుంచి 15వరకు ఏపీలో జస్టిస్ మంజునాథ్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కాపులను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అంశంపై జస్టిస్ మంజునాథ్ కమిషన్ ప్రజాభిప్రాయం సేకరిస్తుందని తెలిపారు. రూ.5 కోట్ల వ్యయంతో 5 కాపు భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు చినరాజప్ప చెప్పారు.