: నాకు విడాకులివ్వకుండానే నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడు: మరోసారి పోలీసులకి స్పష్టం చేసిన నటి పూజిత
తనకు విడాకులివ్వకుండానే తన భర్త విజయ్‌గోపాల్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలుగు సినీ, బుల్లితెర నటి పూజిత మరోసారి పోలీసులకి స్పష్టం చేసింది. తన భర్తపై ఇటీవలే పూజిత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డిని పూజిత మరోసారి కలిసింది. తన భర్త ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని, అంతేగాక వారి నుంచి తనకి ప్రాణహాని ఉందని మహేందర్ రెడ్డికి చేసిన ఫిర్యాదులో పూజిత తెలిపింది. తనకు రక్షణ కల్పించి, రేఖారాణి, విజయ్‌గోపాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.