: రఘురాం రాజన్ మనదేశానికి అనుకూలుడు కాదనిపిస్తోంది: సుబ్రహ్మణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్యలు


వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. రఘురాం రాజన్ భార‌త్‌కి అనుకూలుడు కాదనిపిస్తోందంటూ స్వామి వ్యాఖ్యానించారు. రఘురాం రాజన్ అనుస‌రిస్తోన్న ఆర్థిక విధానాలు దేశానికి న‌ష్టాన్ని తెచ్చిపెడుతున్నాయ‌న్నారు. ఆయ‌న విధానాలే దేశంలో తీవ్ర‌త‌ర‌మైన నిరుద్యోగ స‌మ‌స్యకు కార‌ణమని స్వామి ఆరోపించారు. అంతేకాదు, రాజ‌న్‌కు ఇక సెల‌వు ఇచ్చేస్తే మంచిద‌ని వ్యాఖ్యానించారు. వడ్డీరేట్లు పెంచాలని రాజ‌న్ చేస్తోన్న ఆలోచ‌న దేశం న‌ష్ట‌పోవ‌డానికి కార‌ణ‌మ‌వనుందని స్వామి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News