: రామాయణం రంకు, భారతం బొంకు అంటే... 'సాయిదేశం' పెట్టుకుని వెళ్లిపోండి... హిందూ దేశంలో ఎందుకు?: శ్రీగోవిందానంద
హిందువులు పరమ పవిత్ర పురాణాలుగా భావించే రామాయణం, భారతం తదితరాలపై రమణానంద చేసిన వ్యాఖ్యలు గోవిందానందకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పురాణాల్లో పరమ తప్పులున్నాయని, బూతుతో నిండిందని రమణానంద చెప్పగా, రామాయణం రంకు, భారతం బొంకు అని వాదించేవారు, మీకు చెందిన దేశానికి వెళ్లిపోవాలని, సాయి దేశం పేరిట ఓ దేశం పెట్టుకుని హిందూ దేశాన్ని తక్షణం వీడాలని గోవిందానంద డిమాండ్ చేశారు. ఏ పురాణానికీ ప్రమాణాలు లేవని, అన్నీ పుక్కిటి పురాణాలని, సాయి సచ్చరిత్రను తప్ప దేనికీ విలువ ఇచ్చేది లేదని రమణానంద చెప్పడం కార్యక్రమం చూస్తున్న వారిలో అసహనాన్ని పెంచిందని చెప్పొచ్చు.