: విజయ్ మాల్యాను రప్పించేందుకు క‌స‌ర‌త్తు.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని కోరిన ఈడీ


భార‌త్‌లోని వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న‌ రూ.9వేల కోట్ల రుణాల‌ను తిరిగి చెల్లించ‌కుండా బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకుంటోన్న విజ‌య్ మాల్యాను తిరిగి స్వ‌దేశానికి ర‌ప్పించ‌డానికి ఈడీ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను భారత్ కు తిప్పి పంపలేమని బ్రిట‌న్ ప్ర‌క‌టించిన అనంత‌రం ఆయ‌న‌ను భార‌త్ కు రప్పించ‌డానికి ఈడీ మ‌ళ్లీ వేరే మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఆ దిశ‌గా క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఈరోజు ఈడీ ఇంటర్ పోల్ ను కోరింది. ఇంట‌ర్ పోల్ స్పంద‌న కోసం ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News