: పోటీ లేకుండా ఎన్నిక... ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్
రెండు రోజుల క్రితం బీసీసీఐ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్ గా వ్యవహరిస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీకి రాజ్యాంగ పరమైన సవరణలు చేసిన తరువాత, ఓ దేశపు క్రికెట్ బోర్డుకు చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఐసీసీకి అధ్యక్షుడిగా ఉండే అర్హత తొలగిపోవడంతో శశాంక్ బీసీసీఐకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన చైర్మన్ గా తక్షణం విధుల్లోకి వచ్చినట్టని కూడా ఐసీసీ ప్రకటించింది. ఎన్నికైన తరువాత శశాంక్ మాట్లాడుతూ, ఐసీసీ చైర్మన్ గా ఎంపిక కావడం తనకు లభించిన గౌరవమని, తనను ఎన్నుకున్న ఐసీసీ డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలని తెలిపారు. అడుగడుగునా తనకు బీసీసీఐ సహకరించిందని వెల్లడించారు.