: ఓట్ల కోసం ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వను... నరసింహస్వామి ఎదుట విజయకాంత్ ప్రమాణం


మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రంలో ఓట్లను కొనే ఉద్దేశంతో వివిధ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలను ప్రజలకు పంచుతుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం, తన దారి వేరన్నట్టు ఆలయంలో ఓటుకు నోటు ఇవ్వబోనని ప్రతిజ్ఞ చేశారు. చెన్నైలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన దేవుడి ఎదుట నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లను కొనుగోలు చేయనని, ఇది తన శపథమని అన్నారు. ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సమస్యలను పరిష్కరించేందుకు పంచె పైకెత్తి యుద్ధ రంగంలో దిగానని, తనను ఎవరూ కదిలించలేరని కాస్త ఆవేశంగానే ప్రసంగించారు. ఇప్పుడు విజయకాంత్ ప్రతిజ్ఞ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News