: భారత ఎయిర్ ఫోర్స్ కోసం వచ్చిన అత్యాధునిక యుద్ధ విమానం... గోవాలో 9 రోజులుగా పడిగాపులు!


అది రష్యాలో తయారైన అత్యాధునిక మిగ్-29కే యుద్ధ విమానం. భారత వాయు సేనకు సేవలందించేందుకు వచ్చింది. ఆ విమానాన్ని గత 9 రోజులుగా గోవా నౌకాశ్రయం నుంచి కదలనీయలేదు. ఎందుకో తెలుసా? విమానం నౌకాశ్రయానికి వచ్చినందున రూ. 160 కోట్ల కస్టమ్స్ సుంకాలను చెల్లించాలని అధికారులు పట్టుబట్టడమే. ఈ డబ్బు కట్టి విమానాన్ని తీసుకెళ్లాలని రక్షణ మంత్రిత్వ శాఖకు అధికారులు స్పష్టం చేశారు. రక్షణ రంగం చేసుకునే దిగుమతులపైనా కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిందేనన్న ఆదేశాలు ఈ ఏటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని రకాల మిలటరీ హార్డ్ వేర్ దిగుమతులపైనా పన్నులు తప్పవని చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పలు విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో రక్షణ రంగ పరికరాల నిల్వలు పెరిగిపోతున్నాయని తెలుస్తోంది. కాగా, మిగ్ 29కే ఈ నెల 2న గోవా నౌకాశ్రయానికి చేరింది. ఇదొక్కటే కాదు. మిరేజ్ 2000 విమానాల విడిభాగాలు, ఐఎల్-76 ట్రాన్స్ పోర్టర్ ఇంజన్లు తదితరాలు తీసుకెళ్లేవారు లేక పాడైపోతున్నట్టు సమాచారం. ఇక మరో విషయం ఏంటంటే, కస్టమ్స్ సుంకాలతో పాటు మిగ్ 29కేను నిలిపి ఉంచినందుకు రోజుకు రూ. 35 లక్షల అదనపు అద్దెను రక్షణ శాఖ చెల్లించాల్సి వుంది.

  • Loading...

More Telugu News