: వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలు!... కొత్తవెందుకంటున్న ఏపీ పీఏసీ చైర్మన్!


సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ యువ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న హైదరాబాదులో కొత్త వాదనను వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో ఏపీలోని రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన బుగ్గన... ఆ ప్రాజెక్టులను నిలిపివేసే విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను ఎడారిగా మార్చే ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ నామమాత్రంగా కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ప్రభుత్వం... ఆ తర్వాత అసలు ఆ విషయాన్నే మరిచిపోయిందని ధ్వజమెత్తారు. అయినా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు అవసరం లేదని పేర్కొన్న ఆయన... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News