: సివిల్స్ లో 80వ ర్యాంకు సాధించిన బీహార్ ఎమ్మెల్యే కుమారుడు
బీహార్ లో నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపి, ఓ ఎమ్మెల్సీ కుమారుడు కలకలం రేపితే... జేడీ(యూ) ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్ సింగ్ కుమారుడు డాక్టర్ వివేక్ కుమార్ సివిల్స్ లో సత్తా చాటి సంచలనం రేపాడు. తాజాగా విడుదలైన సివిల్స్ లో ఆయన 80వ ర్యాంకు సాధించాడు. దీనిపై వీరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి తండ్రి తన కుమారుడు తనకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాడని, తన కుమారుడు సాధించిన విజయం చూసి గర్వంగా ఉందని అన్నారు. వివేక్ సివిల్స్ లో విజయం సాధిస్తాడని అస్సలు ఊహించలేదని ఆయన అన్నారు. కాగా, కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో మూడో ప్రయత్నంలో విజయం సాధించానని వివేక్ చెప్పారు. వాస్తవానికి వివేక్ అమెరికా వెళ్లి ఎండీ చేయాలని భావించాడని, వీసా రావడానికి ఆలస్యం కావడంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడని, పగలంతా నిద్రపోయి రాత్రిళ్లు చదవివేవాడని, సమయానికి తిండి కూడా తినేవాడు కాదని ఆయన చెప్పారు.