: సీఫుడ్ తో మతిమరపునకు చెక్ పెట్టొచ్చు: నెదర్లాండ్స్ పరిశోధకులు
ఙ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం కారణంగా చెప్పిన పనులు లేక చేయాల్సిన పనులు గుర్తుండకపోవడం, చదవింది మరచిపోవడం.. ఇలా బాధపడేవారికి సీఫుడ్ మంచి ఆహారమని నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయమై యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అండ్ వేజినింజిన్ కు చెందిన పరిశోధకులు 915 మందిపై సర్వే నిర్వహించారు. కనీసం వారానికి ఒకసారి చేపలు, పీతలు, రొయ్యలు లాంటివి మన ఆహారంలో ఉండేలా చూసుకుంటే మతిమరపు సమస్య నుంచి బయటపడవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా, వృద్ధుల్లో మతిమరపు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతోంది. పరిశోధకులు సూచించిన విధంగా మనం తీసుకునే ఆహారంలో సీఫుడ్ ఉంటే.. మతిమరపు సమస్య నుంచి బయటపడచ్చు.