: జగద్గురువు ఆదిశంకరుడి జయంతిని ఫిలాసఫర్స్ డేగా ప్రకటించాలి: శృంగేరి పీఠం
జగద్గురువు ఆది శంకరాచార్యుల జయంతిని జాతీయ తత్వవేత్తల దినోత్సవం (ఫిలాసఫర్స్ డే) గా ప్రకటించాలని శృంగేరి పీఠం కోరింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. శంకరాచార్యుల వారు స్థాపించిన మిగిలిన పీఠాలకు చెందిన వారు కూడా ఇదే విఙ్ఞప్తి చేశారు. శంకరుల జయంతిని ఫిలాసఫర్స్ డే గా ప్రకటించాలని కోరే విషయమై శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద ఢిల్లీ వెళ్లారు. ఆదిశంకరుల జయంతి సందర్భంగా ఈరోజు ఇండియా గేట్ వద్ద నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటారు.