: ఉత్త‌ర‌కొరియా రాజ‌ధానిలో సంబ‌రాలు... కలర్ ఫుల్ వాతావరణం!


ఉత్త‌ర కొరియాలోని అధికార‌ ‘వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా’ ఛైర్మన్‌గా రెండు రోజుల క్రితం కిమ్‌ జాంగ్‌ ఉన్ ఎన్నికైన సంగ‌తి విదిత‌మే. దాదాపు 36 ఏళ్ల‌ తరువాత జరుగుతున్న పార్టీ తొలి మహాసభలో ఛైర్మన్ పదవికి కిమ్ జాంగ్ ఉన్‌ను ఎన్నుకోవ‌డంతో ఆ దేశ ప్ర‌జ‌లు సంబ‌రాల్లో మునిగారు. క‌ల‌ర్ ఫుల్ దుస్తుల‌తో ఉత్త‌ర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఒక్క‌చోట‌కు చేరుకున్న వంద‌లాది మంది ప్ర‌జ‌లు కాంతులీనే విద్యుత్ వెలుగుల మ‌ధ్య వేడుకను జ‌రుపుకుంటున్నారు. కొవ్వొత్తుల‌ను చేతిలో ప‌ట్టుకొని పెరేడ్ నిర్వ‌హించారు. అనంత‌రం వీనుల విందైన సంగీతం వినిపిస్తుండగా డ్యాన్స్‌లు చేస్తూ సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించిన విద్యుత్ దీపాల వెలుగులు ఆహూతుల‌ను ఆక‌ర్షింప‌జేస్తున్నాయి.

  • Loading...

More Telugu News