: ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ‘మేక్ ఇన్ ఇండియా’
మేక్ ఇన్ ఇండియా డివైజ్ లకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. భారత బ్రాండ్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 45 శాతం నమోదయ్యాయని, 2015 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇవి 7 శాతం పెరిగాయని తాజాగా వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో మేడ్ ఇన్ ఇండియా హ్యాండ్ సెట్లు 67 శాతం దోహదం చేశాయని ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ - 2016 మొదటి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. రూ.10 వేల నుంచి రూ.15 వేల ధర కలిగిన డివైజ్ ల పెరుగుదలలో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లీ ఇకో, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన లెనోవో, ఓపో, ఎల్ జీ, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, ఎవ్ వైఎఫ్, వివో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. సగటున స్మార్ట్ ఫోన్ అమ్మకాల ధరలు కూడా పెరిగాయని పేర్కొంది.