: ప్రధానిని కలుస్తా...నేతలు, ప్రజలకు ధన్యవాదాలు: హరీష్ రావత్
విశ్వాసపరీక్షలో నెగ్గడంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వాసపరీక్ష ఫలితాన్ని సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన నేతలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, తనపై నమ్మకం ఉంచిన వారికి రుణపడి ఉంటానని అన్నారు. ఇకపై రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలన గాడితప్పడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతానని ఆయన చెప్పారు.