: సుబ్రతారాయ్ పెరోల్ మరో ఐదు వారాలు పొడిగింపు


రెండు సంవత్సరాలా రెండు నెలల పాటు తీహార్ జైల్లో గడిపిన అనంతరం, తల్లి అంత్యక్రియల నిమిత్తం 4 వారాల పెరోల్ పై బయటకు వచ్చిన సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతారాయ్ కి పెరోల్ ను మరో ఐదు వారాలు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మే 6న ఆయన పెరోల్ పై బయటకు రాగా, జూలై 11 వరకూ పెరోల్ ను పొడిగిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం కోర్టు ప్రకటించింది. సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ. 200 కోట్లను సమీకరించేందుకు వెసులుబాటు కల్పించాలన్న ఆయన తరఫు న్యాయవాదుల పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. సమయంలోగా డబ్బు డిపాజిట్ చేయకుంటే, తిరిగి తీహార్ కు వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించింది. కాగా, దాదాపు రూ. 25 వేల కోట్లను చిన్న ఇన్వెస్టర్ల నుంచి సమీకరించి వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన సుబ్రతారాయ్, 2014, మార్చి 4 నుంచి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News