: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఢిల్లీ ఆఫీసులో అగ్నిప్రమాదం
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కార్యాలయంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆఫీసు భవంతిలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్న సమయం కావడంతో ఆఫీసులో కొంతమందే ఉన్నట్టు సమాచారం. అక్కడి ఉద్యోగులను వెంటనే ఖాళీ చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించి, అగ్నిమాపక యంత్రాలు వచ్చేలోగా, మంటలు మరో అంతస్తుకు విస్తరించాయని తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సి వుంది.