: ప్రత్యూష, మద్దిలేటి రెడ్డికి వివాహం జరిపించి ఇక వియ్యంకులు కండి: కేసీఆర్, చంద్రబాబులకు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడి సూచన!
తల్లిదండ్రుల నిరాదరణకు గురై, ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రికగా మారిన ప్రత్యూష వివాహాన్ని ఆమె కోరుకున్న యువకుడితో జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకున్నట్టుగానే, వెంకట మద్దిలేటి రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దత్తత తీసుకుంటే ఇద్దరు సీఎంలూ వియ్యంకులు అవుతారని, అది రెండు రాష్ట్రాలకూ ఎంతో ఆనందాన్ని కలిగించే అంశమవుతుందని తెలిపారు. మద్దిలేటి రెడ్డి తనవద్దకు వచ్చి, తన ప్రేమ కథ గురించి వివరించాడని, అతని ప్రేమలో నిజాయతీ ఉందని గుర్తించానని తెలిపారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రత్యూష పెళ్లిని జరిపించాలని అచ్యుతరావు కోరారు.