: బ్రిటన్ వర్జిన్ ఐలాండ్ లో కంపెనీలు నిజమే, లాయర్లు చూసుకుంటారు: హెరిటేజ్ డైరెక్టర్ శివప్రసాద్


విదేశాల్లో అక్రమాస్తులు దాచుకున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్‌ స్పందించారు. తానో ఎన్నారైనని, 3 దశాబ్దాలుగా ఫారిన్ కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్నానని తెలిపిన ఆయన, బ్రిటీష్ వర్జిన్ దీవుల్లో సైతం కంపెనీలను నడుపుతున్నట్టు అంగీకరించారు. పనామా పేపర్స్ లిస్ట్‌ గురించిన సమాచారం తనకు తెలియదని, దీన్ని తమ కంపెనీల సిబ్బంది, తన న్యాయవాదులు చూసుకుంటారని స్పష్టం చేశారు. తన వ్యాపారమంతా చట్టబద్ధమేనని వెల్లడించారు. కాగా, పనామా పేపర్స్ లో వెల్లడైన వివరాల ప్రకారం, కనీసం 3 కంపెనీల్లో వరప్రసాద్ కు భాగస్వామ్యం ఉందని, వాటి ద్వారా అక్రమంగా డబ్బు తరలించారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News