: వివాహ బంధాన్ని నిలబెట్టుకునే శక్తి వచ్చినపుడే నా కూతురి పెళ్లి: ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్రవేశించి ప్రస్తుతం డ్వెయిన్ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్’ సినిమాలోను, మరోవైపు అమెరికన్ టీవీ సీరియల్ ‘క్వాంటికో’ షూటింగ్‌తోను బిజీబిజీగా గడిపేస్తోన్న నటి ప్రియాంక చోప్రా పెళ్లి ఎప్పుడు..? అనే అంశంపై ఆమె తల్లి మధుచోప్రా పెదవి విప్పారు. ‘వివాహ బంధాన్ని నిలబెట్టుకునే శక్తి వచ్చినపుడే నా కూతురి పెళ్లి’ అంటూ స్పందించారు. వైవాహిక జీవితంలో ఎంతో మంది సహనాన్ని కోల్పోయి, చిక్కుల్లో పడుతుండడాన్ని తాను గమనించినట్లు మధుచోప్రా చెప్పారు. ఆ సమస్య తన కూతురుకి తలెత్తకుండా.. తన కూతురికి వివాహ బంధాన్ని నిలబెట్టుకునే శక్తి వచ్చినప్పుడే పెళ్లి జరుగుతుందని పేర్కొన్నారు. వయసు దాటి పోతుందనే తొందరలో వివాహానికి కూడా తొందర పడడం సరికాదని అన్నారు.