: ఎమర్జెన్సీ సమయంలో పరీక్షలు రాశారు కదా? వేషం మార్చుకు వెళ్లారా?: మోదీకి ఆప్ కొత్త ప్రశ్న


వివాదాస్పదమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల విషయమై మరో కొత్త ప్రశ్నను ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తింది. 1975లో ఢిల్లీలోని ఏబీవీపీ కార్యాలయంలో బస చేసి, మోదీ పరీక్షలు రాసినట్టు వెల్లడించిన జైట్లీ కామెంట్ ను ప్రస్తావించిన ఆప్ నేత అశుతోష్, ఆ సమయంలో ఇండియాలో ఎమర్జెన్సీ అమల్లో ఉందని గుర్తు చేశారు. ఇక ఎమర్జెన్సీ సమయంలో తాను అరెస్టును తప్పించుకునేందుకు సిక్కు యువకుడి వేషం వేసుకుని తిరిగానని గతంలో మోదీ స్వయంగా వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తన నిజ రూపంతోనే పరీక్షలకు వెళ్లారా? లేక మారువేషంలో వెళ్లి రాశారా? అని అశుతోష్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News