: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత శాతంలో వరంగల్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 85.63గా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 84.70గా ఉంటే, బాలికల ఉత్తీర్ణత శాతం 86.57గా ఉంది. ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే, హైదరాబాద్ 76.23శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. పది స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదయింది. పరీక్షలు నిర్వహించిన నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. జూన్ 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 26వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు స్వీకరిస్తారు.