: తెలంగాణలో నాలుగు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఆకస్మికంగా కురుస్తోన్న వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. 24గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిన్న మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళలో ఎండ కనిపించి, ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రానికి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు.