: 'చైనా' బ్యాచ్ కు ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేసే హక్కు ఉందా?: నవ్యాంధ్ర విద్యా పరిరక్షణ సమితి నిలదీత
చైతన్య- నారాయణ (చైనా) బ్యాచ్ కు ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేసే హక్కు ఉందా? అని నవ్యాంధ్ర విద్యాపరిరక్షణ సమితి ఏపీ మంత్రులను నిలదీసింది. గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులు చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్నారని వారు తెలిపారు. అంతకంటే దారుణం ఏంటంటే, ఎంసెట్ ఫలితాల్లో 80 ర్యాంకులు చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లోని వారే సాధించారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఉహించాలని వారు అన్నారు. సొసైటీ పేరుతో చైతన్య, నారాయణ సంస్థలు ఫక్తు వ్యాపారం నిర్వహిస్తుండగా, ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని వారు మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు కళాశాలల యజమానులే రిజల్ట్స్ విడుదల చేస్తే...అవి నిజాయతీగా విడుదలైన ఫలితాలని ఎలా విశ్వసించాలని వారు డిమాండ్ చేశారు.