: కాఫ్ సిరప్ తో పాటు ఈ మందులేవీ పని చేయవు...అంతా భ్రమే!: బ్రిటన్ వైద్యుడు


బ్రిటన్ వైద్యుడు చెప్పన విషయం తెలుసుకున్న తరువాత, దేవదాసు సినిమాలో పార్వతి పాడినట్టు 'అంతా భ్రాంతియేనా?' అనే పాట పాడుకోవాల్సిందేనేమో! ఆ విఒవరాల్లోకి వెళితే, చిన్ని పిల్లలు దగ్గుతున్నా, వారికి జలుబు చేసినా వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం సర్వసాధారణం. రోగం లక్షణాలకు కనుక్కున్న వైద్యుడు ఓ కాఫ్ సిరప్, కొన్ని గోళీలు రాసిస్తాడు. నిజానికి ఇలాంటి కాఫ్ సిరప్ తో ఏమాత్రం ప్రయోజనం ఉండదని హల్ యూనివర్సిటీలోని రెస్పిరేటరీ నిపుణుడు ప్రొఫెసర్ అలిన్ మొరైస్ తెలిపారు. కేవలం కాఫ్ సిరప్ కు మాత్రమే ఇది కాదని, ఎముకలు గట్టిపడేందుకు తీసుకునే కాల్షియం మాత్రలు, రక్తంలో చెడుకొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించేందుకు తీసుకునే ఒమెగా త్రీ (మంచి కొవ్వు) చేప నూనె మాత్రలు, చెవినొప్పికి వాడే యాంటీబయాటిక్స్, లయతప్పిన గుండెకు వాడే ఆస్ప్రిన్ మాత్రలు, వెన్ను, మోకాలి నొప్పులకు వాడే పారాసిటమాల్ మాత్రలు, చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డీఎల్ ను తగ్గించేందుకు వాడే స్టాటిన్స్, వెన్ను నొప్పికి చేసే ఆక్యూపంక్చర్ తదితరాలవల్ల ఎలాంటి ఫలితం ఉండదని, మందువాడామన్న రోగి భ్రమ, తద్వారా కలిగే మానసిక స్థైర్యం రోగిని మామూలు మనిషిని చేస్తాయని ఆయన చెప్పారు. డెక్ర్ ట్రో మెథార్ఫాన్ లేని ఏ దగ్గుమందూ పని చేయదని, ఒక వేళ అది ఉన్న మందును సిఫారసు చేసినా దాని పరిమాణం కేవలం 60 ఎంఎల్ ను సూచిస్తారు కనుక అది కూడా పని చేయదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎక్కువ మోతాదులో అంటే పావు సీసా తాగితే కానీ ఫలితం ఉండదని ఆయన చెప్పారు. 5 వేల మంది రోగులపై జరిపిన 29 క్లినికల్ స్టడీస్ లో ఈ విషయం బట్టబయలైనట్టు ఆయన వెల్లడించారు. వైరస్ వల్ల వచ్చే దగ్గు దానంతట అది తగ్గిపోతుందని, బాక్టీరియా వల్ల వచ్చే దగ్గు యాంటీ బయాటిక్స్ వల్ల తగ్గిపోతుందని ఆయన వివరించారు. అలాగే కాల్షియం మాత్రల వల్ల ఎముకలు గట్టిపడతాయని నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారమూ లేదని లీడ్స్ టీచింగ్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ క్లాస్ విట్టీ చెబుతున్నారు. పాలు, వెన్న రూపంలో శరీరంలోకి తీసుకునే కాల్షియం సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నడుం నొప్పికి ఆంక్యూపంక్చర్ పని చేయదని సౌతాంప్టన్ హెల్త్ రీసెర్చర్ ప్రొఫెసర్ జార్జి లెవిత్ చెబుతున్నారు. గుండె జబ్బులకు ఇచ్చే ఒమకార్ (ఒమేగా 3 ఫిష్ ఆయిల్) పనిచేయవని లండన్ బ్రిడ్జి ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియాలజిస్టే సందీప్ పటేల్ చెబుతున్నారు. పదేళ్ల వయసులో ప్రతి నలుగురిలో ఒకరికి చెవిపోటు వస్తుందని, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వైద్యులు యాంటీ బయాటిక్స్ రాస్తారని వారు వెల్లడించారు. వైరస్ కారణంగా చెవిపోటు వస్తుంది కనుక యాంటీబయాటిక్స్ డోస్ పనిచేయదని బ్రిటన్ ఈఎన్ టీ స్పషలిస్టు సంఘం అధ్యక్షుడు టోనీ నెరులా తెలిపారు. వైరస్ వల్ల వచ్చే చెవిపోటు 48 గంటల్లో తగ్గిపోతుందని ఆయన వెల్లడించారు. ఓ మోస్తరు మానసిక ఒత్తిడికి వాడే ఏ మందులూ తగ్గవని ఆయన పేర్కొన్నారు. ఈ జబ్బులకు వాడే మందులేవీ పని చేయవని, అయితే రోగుల విశ్వాసం వాటిని తగ్గినట్టు భావించేలా చేస్తుందని వారు తెలిపారు. దీంతో అంతా 'ఔనా' అని అశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News