: పేక మేడలా కూలడం అంటే ఇదేనేమో...బీహార్ లో కూలిన మూడంతస్తుల భవనం!


బీహార్ లోని ఓ మూడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షోకాఫ్ జిల్లాలోని ఓ గ్రామంలో రైలు బోగీలా కట్టిన ఓ మూడంతస్తుల భవనం భారీ శబ్దం చేస్తూ కుప్పకూలింది. ఇది పడుతూ పడుతూ పక్కింటిపై పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నిర్మాణ లోపాల కారణంగా ఈ భవనం కుప్పకూలిందని స్ధానికులు చెబుతుండగా, భవనం కూలుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనలో ఎవరి ప్రాణాలకూ నష్టం వాటిల్లకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News