: 'బంగారు' కారు...సందర్శకుల హుషారు!


బంగారం కారు అనగానే తెలుగోళ్లకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ నటించిన నాటి సూపర్ హిట్ చిత్రం ‘గజదొంగ’. ఆ చిత్రంలో కారు బంగారంతో తయారు చేశారా? లేక బంగారపు పూతేనా? అనే విషయాన్ని పక్కనపెట్టి, ఇక అసలు విషయంలోకి వెళదాం... దుబాయ్ 'ఆటో మెకానికా 2016' ప్రదర్శనలో నిస్సాన్ ఆర్ 35 జీటీ-ఆర్ కారును ఉంచారు. బంగారపు పూతతో తయారు చేసిన ఈ ప్రత్యేక కారుకు సుమారు పది లక్షల డాలర్ల ఖర్చు అయిందట. స్పోర్ట్స్ కార్ల తయారీదారులైన కెయుహెచ్ ఎల్ రేసింగ్, ఆర్టిస్ సంస్థలు సంయుక్తగా ఈ ప్రత్యేక కారును తయారు చేశాయి. ఇందుకోసం నిపుణుడు తకైకో ఇజావా సహకారం తీసుకున్నారు. 3.8 లీటర్ల ప్రత్యేక బంగారు రంగు, వీ6 ట్విన్ టర్బో, 545 హెచ్పీ ఇంజన్ మొదలైన ఫీచర్లతో రూపొందించిన ఈ కారును గాడ్జిల్లా పేరిట ఆటో ఎక్స్ పో లో ఉంచారు. ఇది అందర్నీ ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News