: ఇక చాలు, ఇళ్లకు వెళ్లండి!: ఎంపీలకు మోదీ క్లాస్


కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ప్రధాని మోదీ తన పార్టీ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26వ తేదీతో మోదీ సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు కానుండటంతో ప్రజల్లో తమ పాలన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు ఎంపీలందరూ ఢిల్లీని వీడి తమ తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఒక్కో ఎంపీ కనీసం వారం రోజుల పాటు ఇళ్లలో ఉండి గడచిన రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను సేకరించాలని, వీటి గురించి ప్రకటనలు ఇవ్వాలని క్లాసిచ్చారు. ఈ ఉదయం మోదీ నుంచి భాజపా ఎంపీలందరికీ ఈ ఆదేశాలు వెళ్లినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 26లోగా ప్రజా స్పందన తనకు తెలియాలన్నది మోదీ అభిమతంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News