: కేసీఆర్ వద్ద చంద్రబాబు పూర్తి జాతకం: జగన్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వద్ద చంద్రబాబునాయుడికి చెందిన పూర్తి అవినీతి జాతకం ఉందని, ఆ కారణంగానే కేసీఆర్ కు బాబు ఎదురు వెళ్లడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధమున్న ఆడియో, వీడియో సాక్ష్యాలు కేసీఆర్ వద్ద ఉన్నాయని, అవి ఏ రోజు బయటకు వచ్చినా, బాబు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందని చెప్పిన జగన్, అందుకు భయపడే, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోవాలన్న ఆలోచన లేకుండా ఉన్నారని ఆరోపించారు. కాకినాడలో పార్టీ చేపట్టిన నిరసనలో పాల్గొన్న జగన్, ప్రసంగిస్తూ, కృష్ణా నీటిని కేసీఆర్ ఆపుతుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఓటుకు నోటు భయం చంద్రబాబులో ఉన్నంత కాలం, రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News