: ‘హోదా’ వ‌స్తే ఏపీలో ప్రతీ జిల్లా హైద‌రాబాద్ లా త‌యార‌వుతుంది: కాకినాడ ధర్నాలో వైఎస్ జగన్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా హైద‌రాబాద్ లా త‌యార‌వుతుందని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నాలు నిర్వ‌హిస్తోంది. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ‌లో నిర్వ‌హిస్తోన్న ధ‌ర్నాలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు హోదా సంజీవ‌ని లాంటిద‌ని అన్నారు. హోదా ఉన్న రాష్ట్రాల‌కు వ్యాట్‌లో 50శాతం రాయితీ లభిస్తుంద‌ని, రాష్ట్రానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని ఆయ‌న అన్నారు. హోదా వ‌స్తే చంద్ర‌బాబు నాయుడు పెట్టుబ‌డుల కోసం తిర‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌బోద‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తే ఉద్యోగాలొస్తాయ‌ని, ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని అన్నారు. ప్రత్యేక హోదా విష‌యంలో తెలుగుదేశం, బీజేపీల తీరును జగన్ విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News