: భైంసాలో భగ్గుమన్న పాత కక్షలు!... మాజీ మహిళా కౌన్సిలర్ సహా మరో వ్యక్తి దారుణ హత్య
ఆదిలాబాదు జిల్లాలోని భైంసాలో పాత కక్షలు బుసలుకొట్టాయి. పట్టణంలోని పాత చెక్ పోస్టు వద్ద మాటు వేసిన ప్రత్యర్థులు మాజీ మహిళా కౌన్సిలర్ సహా మరో వ్యక్తిపై విరుచుకుపడ్డారు. కత్తులతో దాడికి తెగబడ్డారు. ఊహించని ఈ పరిణామంతో ఆ మాజీ కౌన్సిలర్, మరో వ్యక్తి తేరుకునేలోగానే ఘోరం జరిగిపో్యింది. ప్రత్యర్థులు జరిపిన దాడిలో మాజీ కౌన్సిలర్ సహా మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత ఆ దుండగులు క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.