: ఓటమిని అంగీకరించిన బీజేపీ!... రావతే గెలిచారని బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ ప్రకటన


ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ నెగ్గారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అత్యంత గోప్యంగా, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ముగిసింది. ఈ ఓటింగ్ కు సంబంధించిన వివరాలతో అసెంబ్లీ సెక్రటేరియల్ సీల్డు కవర్ లో నివేదికను సుప్రీంకోర్టుకు పంపించనుంది. దీనిని రేపు ఓపెన్ చేయనున్న సుప్రీంకోర్టు ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తుంది. అయితే ఓటింగ్ లో పాలుపంచుకున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గణేశ్... సుప్రీంకోర్టు ప్రకటన కంటే ముందే నోరు జారారు. బల పరీక్షలో రావత్ గెలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. బల పరీక్షకు హాజరైన 62 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు హరీశ్ రావత్ పక్షాన నిలిచారని ఆయన పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావత్ విజయం ఖరారైపోయింది.

  • Loading...

More Telugu News