: మోదీ డిగ్రీ పత్రాలపై వెనక్కి తగ్గని ఆప్.. నేడు ఢిల్లీ వర్శిటీలో సర్టిఫికెట్లపై ఆరా తీయనున్న నేతలు
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ పత్రాలు నకిలీవంటూ ఆరోపిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆ అంశంపై వెనక్కి తగ్గడం లేదు. నేడు ఢిల్లీ వర్సిటీలో ఆప్ నేతలు ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై ఆరా తీయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను బయటపెట్టిన నేపథ్యంలో ఆప్ నేతలు దానిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ అధినేత కేజ్రీవాల్ వద్ద సీఐసీ ఆర్డర్ ఉండగా, డిగ్రీ పత్రాలను సీల్డ్ గా ఎందుకు ఉంచుతున్నారని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు నేడు మోదీ డిగ్రీ వివరాలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా మీడియాకు చూపిన సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినవేనని, ఢిల్లీ వర్శిటీకి తాము వెళ్లి, సదరు పత్రాలను పరిశీలించి తీరుతామని ఆప్ నేతలు తెలిపారు.