: సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ!... చైన్ లాగి రైలును ఆపి దొంగల స్వైర విహారం!


తెలుగు రాష్ట్రాల్లో రైళ్లపై దోపిడీ దొంగల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలంగాణలోని వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ పై దాడి చేశారు. యశ్వంత్ పూర్- పాట్నాల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ రైలును చైన్ లాగి ఆపేసిన దోపిడీ దొంగలు రైల్లోని ఎస్-2, ఎస్-11 బోగీల్లోని ప్రయాణికులపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఉన్నట్టుండి రైల్లో దోపిడీ దొంగలు ప్రవేశించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

  • Loading...

More Telugu News