: విఫలమైన కోహ్లీ, వాట్సన్...క్రీజులో డివిలియర్స్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) రాణించగా, విరాట్ కోహ్లీ (20), షేన్ వాట్సన్ (1) విఫలమయ్యారు. దీంతో బెంగళూరు తొలిసారి ఇబ్బందుల్లో పడింది. కాగా క్రీజులో డివిలియర్స్ (24), బేబి (22) దూకుడుగా ఆడుతున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ బౌలర్లలో కరియప్ప రెండు వికెట్లు తీసి రాణించగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News