: ఇది మా అభయ్ 'జనతా గ్యారేజ్' సెట్ ఫస్ట్ విజిట్: జూనియర్ ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సెట్ లో ఓ వీఐపీ సందడి చేశాడు. వీఐపీ రావడంతో సినిమా యూనిట్ మొత్తం అతనితో ఆడుకునేందుకు ఆసక్తి చూపింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో 'జనతా గ్యారేజ్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లో యూనిట్ నిమగ్నమై ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ తల్లి ప్రణతితో కలిసి స్పాట్ కు చేరుకున్నాడు. స్పాట్ మొత్తం కలియతిరిగాడు. దీంతో యూనిట్ మొత్తం అభయ్ ని ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను 'ఇది అభయ్ జనతా గ్యారేజ్ షూట్ ఫస్ట్ విజిట్' అంటూ క్యాప్షన్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కు సబ్ జూనియర్ ఎన్టీఆర్ జతకలిశాడంటూ అతని అభిమానులు లైకులు, షేర్లతో సందడి చేస్తున్నారు.