: పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పాము: టీఎస్ మంత్రి హరీష్ రావు
సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కర్నాటక, మహారాష్ట్రతో మంచి సంబంధాలు నెలకొల్పామన్నారు. కేవలం ప్రాజెక్టులను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా మిగిలిన విషయాలను కూడా ఆలోచించి పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రవాణా, శాంతిభద్రతలు మొదలైన విషయాలు పొరుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.