: ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వద్దు... అర్థం చేసుకోండి: గంటా ప్రకటన
రేపు ఉదయానికల్లా ఎంసెట్ ఫలితాలు వెల్లడవుతాయని ఆందోళన వద్దని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. నీట్, ఎంసెట్ అర్హతపై స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఎంసెట్ నిర్వహణపై సుప్రీంకోర్టు అభ్యంతరం లేవనెత్తితే, దానిపై స్పష్టతనిచ్చి, ఇంజనీరింగ్ ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని, కాసేపట్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు.